ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మళ్లీ సీఎం కానున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న ఒక్కరోజే మూడు సర్వేల ఫలితాలు వెలువడగా మూడు సర్వేలలో రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని వెల్లడైంది. మూడు సర్వేలు వైసీపీ రాష్ట్రంలో 120 నుంచి 130 స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించడం గమనార్హం. మూడు సర్వేలతో ఏపీలో పొలిటికల్ లెక్కలు మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రేస్ సర్వే ఇప్పటికే చాలాసార్లు సర్వే ఫలితాలను వెల్లడించగా తాజాగా తుది సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో కుప్పంలో చంద్రబాబు నాయుడుకు ఓటమి తప్పదని తేలిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో రేస్ సర్వే ఫలితాలు నిజమయ్యేలా ఉన్న నేపథ్యంలో ఏపీలో ఈ సర్వే లెక్కలు నిజం అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. రేస్ సంస్థ మరోమారు వైసీపీదే విజయమని తేల్చి చెప్పింది.
 
మరోవైపు పోల్ స్ట్రాటజీ గ్రూప్, ఎలక్ సెన్స్ సర్వే ఫలితాలు వెల్లడి కాగా ఈ సర్వేలలో సైతం వైసీపీ 120కు పైగా స్థానాలలో సత్తా చాటే ఛాన్స్ అయితే ఉందని వెల్లడైంది. వరుసగా సర్వేలలో జగన్ దే హవా అని వెల్లడవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా వెల్లడైంది. 50 సర్వేల ఫలితాలు వెలువడితే ఆ సర్వేలలో 70 శాతం వైసీపీకి అనుకూలంగా ఉండటం గమనార్హం.
 
సర్వేల ఫలితాలను సులువుగా కొట్టి పారేయలేమనే సంగతి తెలిసిందే. వైసీపీ గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయడం, పేదలను దృష్టిలో ఉంచుకుని పథకాలను అమలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి అదే ప్లస్ అవుతోంది. చంద్రబాబు ఎక్కువ మొత్తం ఇస్తానని చెబుతున్నా ఆ మాటలను మాత్రం ఎవరూ నమ్మడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి ఎలాంటి టెన్షన్ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: