అంతేకాదు మోదీతో చంద్రబాబు భేటీ అయ్యేలా చేశారు చంద్రబాబును మోదీకి దగ్గర చేయడంలో పవన్ చాలా కీలకమైన పాత్ర పోషించారు. నిజానికి చంద్రబాబు అంటే మోడీకి కోపమే కానీ పవన్ కళ్యాణ్ కోరిక మనకు చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడానికి ఒప్పుకున్నారు. ఈ పొత్తు ఎత్తులతో టీడీపీ ఏపీలో జగన్‌కు ఒక బలమైన ప్రత్యర్థిగా ఎదగగలిగింది. ఈ టీడీపీ + కూటమి 2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కింద పడుతున్న పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడ్డారు. అంతేకాదు కేవలం 21 అసెంబ్లీ సీట్లతోనే సరిపెట్టుకున్నారు. అది చాలా పెద్ద త్యాగం అని చెప్పుకోవచ్చు. అనుకున్న లక్ష్యం కోసం పవన్ చేసిన చాలా మంచి పనులు ఇవే అని చెప్పుకోవచ్చు.
అయితే పార్టీలో చాలా బాగా పనిచేసిన కొంతమందికి పవన్ కళ్యాణ్ సీట్స్ ఇవ్వలేదు అందువల్ల అతనికి చెడ్డ పేరు వచ్చింది. ఇంకా ఆయన కొన్ని తప్పులు చేసి సొంత పార్టీలోనే చాలామంది చేత మాటలు పడ్డారు. ఏది ఏమైనా శక్తి వంచన లేకుండా చాలా కష్టపడుతూ పనిచేశారు. మరి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి. మే 13 అంటే రేపే ఏపీలో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది. ఇందులో గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఏం జరుగుతుందో రిజల్ట్స్ రోజే తేలనుంది.