ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పిఠాపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షో లో భాగంగా జగన్ తన పార్టీ అభ్యర్థి అయినటువంటి వంగ గీత ను ఎందుకు జనాలు గెలిపించుకోవాలి..? అలాగే ఇక్కడ నుండి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ ను ఎందుకు చిత్తుచిత్తుగా ఓడించాలి అనే విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సభలో టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు మోసాల గురించి కూడా జగన్ చెప్పుకొచ్చాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు 2014వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అధికారంలోకి రావడం కోసం ఎన్నో తప్పుడు హామీలను ఇచ్చారు. ఆ అమీలను నమ్మి ఓటు వేసిన రైతులు, ప్రజలు ఎంతో నష్టపోయారు. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం వచ్చేసరికి ఆయనను జనాలు నమ్మడం మానేశారు. దానితో ఎంతో గొప్ప పార్టీ, నమ్మకం కలిగిన పార్టీ అయినటువంటి వైసీపీ ని జనాలు నమ్మి ఓటు వేసి అధికారాన్ని ఇచ్చారు.

మేము ఎంతో గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలించాము. రైతులకు, ఆడ బిడ్డలకు, పేద ప్రజలకు ఎన్నో గొప్ప పథకాలను తీసుకువచ్చి వారికి ఎంతో మేలు చేశాము.  ఇక రాబోయే ఎలక్షన్ల తర్వాత అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అవి చేస్తాం, ఇవి చేస్తాం అని ఎన్నో హామీలను ఇచ్చాడు. అవి చేయడం కుదరదు అది అతనికి కూడా తెలుసు. మేము గతంలో ఎప్పుడు జరగని విధంగా ప్రణాళికలను వేసి గొప్ప గొప్ప పథకాలను ప్రజలకు అందజేస్తే సంవత్సరానికి 70 వేల కోట్ల బడ్జెట్ అవుతుంది.

ఇక చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో కు సంవత్సరానికి లక్ష 65 వేల కోట్ల బడ్జెట్ అవుతుంది. ఇంత మొత్తంలో సంవత్సరానికి జనాలకు ఇవ్వడం సాధ్యం కాదు, వీలు కాదు అని వారికి తెలుసు. అయిన ఆ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఒక వేళ వారు గెలిచినట్లు అయితే మళ్లీ చంద్రబాబు నాయుడు చేతికి కత్తి ఇచ్చి రైతన్నను పొడిచినట్లే అవుతుంది అని జగన్ తాజా రోడ్ షో లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: