ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి శనివారం చివరిరోజు ఎన్నికల ప్రచారం పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించారు. ఈప్రచారంలో భాగంగా  ఆయన మాట్లాడుతూ దత్తాపుత్రుడిపై బరిలోకి దిగిన వంగ గీతను గెలిపించవలసిందిగా కోరారు.పిఠాపురం అభివృద్ధి గీతతోనే సాధ్యమని తెలిపారు.చిన్న జలుబు చేస్తేనే పిఠాపురం నుంచి హైదరాబాద్‌కు పారిపోయాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా అని ప్రశ్నించారు. ఆయన్ను మహిళలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఐదేండ్లకు ఒకసారి కార్లు మార్చినట్లుగా దత్తపుత్రుడు భార్యలను మార్చేస్తాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నమ్మి మహిళలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. ఒకసారి చేస్తే పొరపాటు అని రెండోసారి చేస్తే గ్రహపాటు అని మూడోసారి చేస్తే మాత్రం అది అలవాటు అని తీవ్ర విమర్శలు చేశారు.అలాగే సాధ్యం కానీ హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తమ ప్రభుత్వం పథకాలు ఇస్తే.. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను చూస్తే అబద్దాలని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.వంగా గీత నా తల్లి లాంటిది, నా అక్క లాంటిదని ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అదే జరిగితే నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి మీ ముందుకు పంపుతానని జగన్ అన్నారు.జగన్ మాటలకూ ఎమోషనల్ అయినా గీత కంటతడి పెట్టుకొని తాను పిఠాపురంలో పుట్టలేదని అవమానిస్తున్నారని.. నియోజకవర్గానికి దూరం చేస్తున్నారని కంటతడి పెట్టారు. పిఠాపురమే తన కుటుంబమని.. తన అంతిమ యాత్ర కూడా ఇక్కడే జరగాలని తెలిపారు. మళ్లీ పిఠాపురంలోనే పుట్టి మీ రుణం తీర్చుకుంటానని అన్నారు.ఆవిధంగా జగన్ ఇచ్చిన భరోసాతో పిఠాపురం ప్రజల్లో ఎక్కడో కొద్దిగా వంగ గీతా మీద అలాగే జగన్ చేసిన సంక్షేమ పధకాలు నిజమేగా అన్నట్లు కంటిముందు కనిపించాయి. దాంతో పిఠాపురం ప్రజల మైండ్ సెట్ చేంజ్ అయినట్లు తెలుస్తుంది కచ్చితంగా గ్లాస్ కాదని ఫ్యాన్ వైపు తిరిగేలా జగన్ ప్రసంగం ఉందని అక్కడి ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: