రేపే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ప్లస్ కూటమి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారం కసిగా చేసింది. అయితే ఈసారి క్లీన్ స్వీప్‌ చేయాలనే ఉద్దేశంతో జగన్ అద్భుతమైన ప్రసంగాలను ఇచ్చారు. ఈ ఐదేళ్లలో పథకాల ద్వారా ప్రజలకు ఎంత మేలు చేశామో తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ , నందమూరి బాలకృష్ణ, మోదీ ఇలా టీడీపీ కూటమిని గెలిపించడానికి చాలామంది ఎన్నికలు ప్రచారం చేస్తే వైసీపీ తరఫున కేవలం జగన్ ఒక్కరే సింగిల్ గా ప్రచారం చేశారు.

వై నాట్ 175 అనే నినాదంతో ఏపీని షేక్ చేశారు. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించారు. టీడీపీ అధినేత చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించే ఎత్తుగడను కూడా వైసీపీ అధిష్టానం వేసింది. ఇందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని బరిలోకి దింపింది. ఆయన చంద్రబాబు నుంచి ఓటర్లను దూరం చేసే విషయంలో దాదాపు సక్సెస్ సాధించారని తెలుస్తోంది. వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడల కారణంగా కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి కుప్పంలో చంద్రబాబు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం వైసీపీ ఆ పరిస్థితులను రివర్స్ చేసినట్లు కనిపిస్తోంది. నారా భువనేశ్వరి కుప్పంలో క్యాంప్ వేసి మరీ ఎన్నికల ప్రచారాలు చేశారు కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమె కంటే ఎక్కువగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. 1989 నుంచి వరుసగా కుప్పంలో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తూ వస్తోంది.

భువనేశ్వరి సోదరులతో కలిసి కుప్పం నియోజకవర్గ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. 4 మండలాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కొనసాగించారు. ఎంత కృషి చేసినా వారికి మాత్రం నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ టీడీపీ ఓడించింది. తద్వారా అక్కడ ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా మారారని అర్థమవుతోంది. చంద్రబాబును అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడించడం ఈసారి సాధ్యం కావచ్చు. భువనేశ్వరి లక్ష ఓట్లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కుప్పం ప్రజలకు ఎప్పటికీ తాము రుణపడి ఉంటామని సెంటిమెంటల్‌గా ప్రసంగాలు ఇచ్చారు. కానీ ప్రజలు టీడీపీని ఇకపై నమ్మబోరని అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబును ఓడించడం వైసీపీకి పెద్ద విజయం అవుతుంది. అలానే ఓటమి చంద్రబాబుకు పెద్ద షాక్ లాగా తగులుతుంది. సొంత నియోజకవర్గంలో ఓడిపోతే ఆయన మెంటల్ గా దెబ్బతిని పిచ్చోడు అయిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: