ఏపీ సీఎం జగన్ కేవలం పంచుడి కార్యక్రమాలతో పబ్బం గడుపుతున్నారని, ఉద్యోగాలను క్రియేట్ చేయడం లేదనే విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం లేదని వ్యాపారాల అభివృద్ధి కూడా జరగడంలేదని, జగన్ పాలనలో ఏపీ శ్రీలంక అవుతుందని ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు హయాంలో కంటే జ‌గ‌న్ హ‌యాంలోనే ఎక్కువ మంది ఉపాధి పొందార‌నేది వాస్త‌వం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్‌లకు క‌రోనా స‌మ‌యంలో రెండేళ్ల‌కుపైగా విద్యుత్ బిల్లులు జగన్ ర‌ద్దు చేశారు. కొత్త‌గా సంస్థ‌లు స్థాపించేవారికి ప్రోత్సాహ‌కాలు ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసును చాటుకున్నారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధికి జగన్ ప్రభుత్వం ఎంతగానో సహాయ పడింది. తద్వారా ఆయా సంస్థలు విస్తరించుకుంటూ పోతూ ఉపాధి ఎక్కువగా కల్పించాయి. స్వయం సమృద్ధి ఉద్యోగాలను ఎక్కువగా సృష్టించిన పార్టీగా వైసీపీ ఒక చరిత్ర కూడా సృష్టించింది. ప్రభుత్వ రంగ ఉపాధి కల్పనలో వైసీపీ పనితీరు సాటిలేనిదని జగన్ మోహన్ రెడ్డి అఫీషియల్ రికార్డ్స్ తో సహా ఒకసారి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం 3.97 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో 34,108 ఉద్యోగాలు మాత్రమే టీడీపీ అధికారంలో ఉండగా వచ్చాయని జగన్ తెలిపారు. అంటే గడిచిన మూడేళ్లలో, 2.06 లక్షల కొత్త ఉద్యోగాలు మంజూరు చేయడం జరిగింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను అందించడమే కాకుండా ఏపీలో వ్యాపారాలు పెరగడానికి కూడా జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఓన్లీ సంక్షేమ పథకాలతో జగన్ సరిపెట్టడం లేదని, అన్ని విధాలుగా మంచి చేస్తున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలను అందించడమే కాదు చదువుకుంటున్న విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించే లాగా కూడా విద్యను అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకునేలాగా, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే లాగా అమ్మ ఒడి పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇన్ని చేస్తున్న జగన్ కు చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఎలా ఓట్లు వేస్తారనేదే అసలైన ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: