పోటీ చేసే అభ్యర్థులతో కొంత మనీ డిపాజిట్ చేయించుకుని, దానికి తాను కొంత మనీ జోడించి ఓటర్లను ఆకర్షించడానికి కూడా బాగా ప్రయత్నించారు. అయితే ఈ ప్లాన్లను అమలు చేయడంలో చంద్రబాబు 2019లో ఫెయిల్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యారు. అవే ప్లాన్స్ తెలుసుకుని జగన్ మాత్రం రెండుసార్లు సక్సెస్ అయ్యారు. మనీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సక్సెస్ అయ్యారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా సక్సెస్ అయ్యారు. ఇది చంద్రబాబులో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని సమాచారం.
ఇకపోతే మే 13 అంటే రేపే జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. సర్వేలైతే జగన్ గెలుస్తారని స్పష్టంగా తేల్చాయి. ప్రజలు కూడా జగన్ కే ఓటేస్తామని బహిరంగంగా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుని నమ్మి పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి బాబోరు అతి హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం కూడా మైనస్ అయ్యింది. ఎన్నికల ప్రచారాల సమయంలో నోరు జారటం, సంక్షేమ పథకాలను నిలిపివేయడం, వాలంటీర్ కార్యకలాపాలకు బ్రేక్ వేయడం లాంటివి కూడా బాబోరుకి నెగిటివిటీ నే తెచ్చిపెట్టాయి.