జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఈ నియోజకవర్గంలో తన ఓటు తాను వేసుకునే పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓటు మంగళగిరిలో ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కష్టం పగోడికి కూడా రాకూడదంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
 
గత ఎన్నికలకు భిన్నంగా పోటాపోటీగా ఈ ఎన్నికలు జరగనుండటంతో ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కూటమి నేతలకు టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే జనసేన పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.
 
పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఊహించని స్థాయిలో ఖర్చు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి పిఠాపురంలో కరపత్రాలు పంచుతూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ను ఎంచుకుని తప్పు చేశారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
 
పవన్ కళ్యాణ్ కు గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలలో భారీ షాకులు తగిలాయి. వైసీపీ అభ్యర్థుల చేతిలో పవన్ కళ్యాణ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సైతం పవన్ కు వైసీపీ అభ్యర్థి వంగా గీత నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వంగా గీత లోకల్ కావడం ఆమెకు మరింత కలిసొస్తోంది. పవన్ వర్సెస్ వంగా గీత పోటీలో వంగా గీతకే ఎడ్జ్ ఉందని సమాచారం అందుతోంది. జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న చాలామంది నేతలకు సైతం ఈ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు రాబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: