జగన్ 16 నెలల జైలు జీవితం సమయం ఎన్నో కష్టాలు చూశారు. గత ఐదేళ్లలో అవినీతి మరక అంటకుండా పాలనను సాగించడంలో జగన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. ప్రజల కష్టాల గురించి ఎరిగిన వ్యక్తి కాబట్టే జగన్ నవరత్నాల పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశారు. జగన్ అమలు చేసిన పథకాలలో మెజారిటీ పథకాలు కొత్త పథకాలు కావడం గమనార్హం.
కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగిన జగన్ అమలు చేసిన పథకాల ద్వారా ఐదేళ్లలో 5 లక్షల రూపాయల లబ్ధి పొందిన కుటుంబాలు సైతం ఉన్నాయి. ఎంతోమంది మహిళలు జగన్ అమలు చేసిన పథకాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడ్డారు. జగన్ లా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఓట్లు అడిగిన సీఎంను తాము చూడలేదని నెటిజన్లు చెబుతున్నారంటే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి.
ఏపీలో దాదాపుగా 2.30 కోట్ల పల్లెటూరి ఓటర్లు ఉండగా ఆ ఓట్లలో మెజారిటీ ఓట్లు వైసీపీకే అనుకూలంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం అందుతోంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు జగన్ పక్షానే నిలబడ్డారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న స్థాయి ఉద్యోగులు జగన్ మళ్లీ గెలిపించుకుంటామని చెబుతున్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిజం చేయడంలో జగన్ ఎంతో సక్సెస్ అయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.