ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొట్ట మొదటి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ అద్భుతమైన మెజారిటీని తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఐదు సంవత్సరాల పాటు బాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈయన పరిపాలన విషయంలో ప్రజలు పెద్దగా సంతృప్తి చెందలేదు. దానితో 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీకి పెద్ద స్థాయిలో సీట్లు దక్కలేదు. ఇక వైసీపీ పార్టీ భారీ సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకొని 2019 వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

జగన్ సీఎం అయిన తర్వాత ఆయన అనేక  విషయాలలో చాలా చురుగ్గా పాల్గొనడం, అలాగే తనదైన రీతిలో ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉండడంతో ఈయనకు జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా వైసీపీ పార్టీనే అధికారంలోకి రాబోతున్నట్లు అనేక సర్వేలు గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నాయి. దానితో చంద్రబాబు నాయుడు ఈ సారి ఎలాగైనా సీఎం కావాలి అనే ఉద్దేశంతో తన బలంతో పాటు మరి కొంత మంది బలాలను కూడా చేర్చుకున్నాడు.

టీడీపీ ఈ సారి ఒంటరిగా కాకుండా జనసేన బీజేపీ లతో పోటీలోకి దిగబోతోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు కుప్పం నుండి పోటీలోకి దిగబోతున్నాడు. కుప్పం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా భారత్ పోటీలో ఉన్నారు. ఇక జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు ఎలాగైనా కుప్పంలో  గెలుస్తాను అనే నమ్మకంతో అక్కడ పెద్దగా ప్రచారాలు ఏమీ చేయడం లేదు.

కానీ పవన్ మాత్రం ఈ సారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలి అని ఇక్కడ భారీ స్థాయిలో ప్రచారాలను చేస్తున్నాడు. ఇక చంద్రబాబు అత్యధిక స్థానాలను సాధించి సీఎం కావాలి అని చూస్తుంటే, పవన్ మొదట తాను గెలిచి ఆ తర్వాత కొన్ని సీట్లు వస్తే చాలు అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఇక చంద్రబాబు సీనియారిటీ, పవర్ స్టార్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని నిలబెడుతుందో... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: