ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి.2, 841 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొన్ని గంటలలో తేలబోతోంది.. అసెంబ్లీ నుంచి 2,387 మంది లోక్సభ నుంచి 454 మంది భవిష్యత్తు నిర్ణయించడానికి 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును సైతం వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ కూడా ప్రారంభం అవుతుంది. అందుకు సంబంధించి పూర్తి విషయాలను కూడా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్నటి రోజున తెలియజేశారు. ముఖ్యంగా 12,438 పోలింగ్ కేంద్రాలలో చాలా భద్రతలను ఏర్పాటు చేశామని తెలియజేశారు.


మొత్తం పోలింగ్ కేంద్రాలకు 31,385 చోట్ల దాదాపుగా 75% కేంద్రాలను లోపల బయట పూర్తిస్థాయిలో పగడ్బందీగా పరిరక్షించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని మీనా వెల్లడించారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా అన్ని జిల్లాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ఉంటామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ఐదేళ్లకొకసారి ఓటుని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తోంది ముఖేష్ కుమార్ మీనా. న్యాయపరంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలని తెలియజేస్తుంది.


గత ఎన్నికలు రాష్ట్రంలో 79.84 శాతం వరకు ఓటింగ్ నమోదయిందని ఈసారి ఎన్నికలలో 83% ఓటింగ్ లక్ష్యంతోనే ఓటర్లకు సైతం చైతన్యం కల్పించేలా పలు రకాల కార్యక్రమాలను కూడా తెలియజేశారు.. ముఖ్యంగా వృద్ధులు, యువత, మహిళలు పర్యావరణం పేరుతో మోడలింగ్ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్లో వద్ద ఓటర్లకు అవసరమైన తాగునీరు, వీల్ చైర్స్, ప్రధమ చికిత్స సేవలు అందుబాటులో ఉంటాయని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.


రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలు జరుగుతుంటాయి.. ఈ సార్వత్రిక ఎన్నికలలో దాదాపుగా 1.60 లక్షల కొత్త ఈవీఎంలను సైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి మొదట్లో ప్రతిపాదించినట్లుగానే 46.165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని అనుకోగా కానీ అదనంగా ప్రతిపాదించిన 224 అల్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 ఈవీఎంలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం ప్రశాంతంగా సక్రమంగా జరిగేలా భద్రతలు చేపట్టామని డిజిపి  హరీష్ కుమార్ గుప్త వెల్లడించారు. అందుకు రాష్ట్ర పోలీసు బలగాలు కూడా కృషి చేస్తున్నారని అదనంగా సిఆర్పిఎఫ్ తమిళనాడు కర్ణాటక పోలీస్ బలగాలను కూడా మోహరించారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: