వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మహిళలకు సైతం ఎక్కువగా డిబిటి రూపంలోనే డబ్బులను చాలా జమ చేసింది. అలాగే మహిళా సంఘాలకు డబ్బు జమ చేస్తూనే ఉన్నారు జగన్. దిశా యాప్ వంటి వాటిని చేపట్టింది.అలాగే నియోజవర్గాల సీట్ల విషయానికి కూడా వస్తే..175+25=200 సీట్లలో 50 శాతం వరకు మహిళలకే వైసీపీ పార్టీ కేటాయించింది. మహిళలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలలో కూడా అమ్మ ఒడి, విద్యా దీవెన, ఇంటి పట్టాలు చేయూత వంటి కార్యక్రమాలను మహిళలకు అమలు చేస్తూనే ఉన్నారు వైసిపి ప్రభుత్వం. దీన్ని బట్టి చూస్తే వైసిపి పార్టీకి మహిళల ప్రాధాన్యత ఎక్కువగానే ఉందనే వాదన వినిపిస్తోంది.
గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు మహిళలకు ఎలాంటి సంక్షేమాలను కూడా అందించలేదు.. అయితే ఈసారి మేనిఫెస్టోలో వైసీపీ పార్టీని చూసి తాను కూడా అంతకుమించి ఇస్తానని చెబుతున్నప్పటికీ ఏపీ మహిళలు ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో అసలు కనిపించడం లేదు.. గతంలో కూడా అంగన్వాడి టీచర్లను కూడా నానా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు.. ఉద్యోగస్తులకు కూడా సెలవులను ఎక్కువగా పెంచారు సీఎం జగన్.. చంద్రబాబు ఇలాంటివి అసలు ఏమీ చేయకుండా కేవలం తమ నేతలు సంపన్నులు కావాలనే ఉద్దేశంతోనే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే 2019 ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయారు చంద్రబాబు.. ఇప్పుడు కూడా మళ్లీ అదే రిపీట్ అవుతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.