ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలలో ఎవరిని కదిలించినా వైసీపీ గుర్తుకే తమ ఓటు అని తేల్చి చెబుతున్నారు. జగన్ ను ఓడించడానికి చంద్రబాబు, పవన్, షర్మిల ఎంతో పోరాడుతున్నారు. అయితే ఎంతమంది కష్టపడినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా జగన్ అనే బాహుబలిదే విజయమని నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
22 జాతీయ మీడియా సర్వేలలో సైతం రాష్ట్రంలో వైసీపీ వన్స్ మోర్ అంటున్నారని వెల్లడైంది. జాతీయ మీడియా సర్వేలలో సైతం ఓటర్లు ఫ్యాన్ కే పట్టం కడుతున్నారని సమాచారం అందుతోంది. ఇంటింటికి ప్రగతి సమ్మిళత అభివృద్ది దిశగా జగన్ ఐదేళ్ల పాలన సాగిందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మళ్లీ జగన్ సీఎం అయితే మాత్రమే తమ భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
 
సిద్ధం సభలు, బస్సు యాత్రలకు అదిరిపోయే రెస్పాన్స్ రాగా వైసీపీ మరోమారు చారిత్రాత్మక విజయం సాధించడం ఖాయమని వెల్లడవుతోంది. ఇన్నేళ్లలో 90 శాతం హామీలను అమలు చేసి మళ్లీ ఓట్లు అడిగిన సీఎం జగన్ మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విద్య, వ్యవసాయ రంగాల్లో జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులతో ఆయా రంగాల్లో అభివృద్ధి ఊహించని స్థాయిలో జరిగింది.
 
రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయంటే అందుకు కారణం జగన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వైద్య రంగంలో సంస్కరణలు కొనసాగాలన్నా, సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం కొనసాగాలన్నా, ఉద్యోగ ఉపాధి విప్లవం మరింత గొప్పగా కొనసాగాలన్నా ఏపీలో జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే సాధ్యమవుతుంది. జూన్ 4వ తేదీన జగన్ మరోసారి తన సత్తా ఏంటో చూపించబోతున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో జగన్ 2.0 చూడబోతున్నామని వైసీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: