ఏపీ చరిత్రలో తొలిసారి ఎంప్లాయిస్ డిఏ ఏరియర్స్, పీఆర్‌సీ ఏరియర్స్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ ఎగగొట్టారని కొంతమంది అంటుంటారు. ఈ మధ్య వైసిపి వాళ్ళు ఇచ్చిన డబ్బులను కొందరు ఉద్యోగులు తిరిగి ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇందులో ఉన్న నిజం ఎంతో తెలియ రాలేదు బహుశా దీనిని చంద్రబాబు టీం కావాలనే ప్రచారం చేసి ఉన్నా ఉంటుంది.
ఓవరాల్ గా జగన్ ఉద్యోగుల విషయంలో కొంతమంది చేశారు కొంత చెడు చేశారు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ కారణంగా ఉద్యోగులు సగం మంది టీడీపీవైపు ఉండగా, మిగిలిన వారు వైసీపీవైపే ఉన్నారు. చంద్రబాబు కన్నా కూడా.. జగనే బెటర్ అనే వాదనను వాళ్లు వినిపిస్తున్నారు.నిజానికి జగన్ హయాంలో ఉన్నప్పుడు చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి వారందరూ కూడా జగన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. పూర్తిగా జగన్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు లేరనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. సారీ ఎలాగూ జగన్ అధికారంలోకి వస్తారని ఉద్యోగులు కూడా బలంగా నమ్ముతున్నట్లు సమాచారం. జగన్ ఉద్యోగుల కోసం ఏదో ఒక మంచి పని చేస్తారని కూడా వారు భావిస్తున్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే మంచి చేయడానికి బదులుగా చెడు చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారట.