ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో డిసైడ్ చేయడంలో సైలెంట్ ఓటర్ల పాత్ర కీలకమని చెప్పవచ్చు. రాష్ట్రంలో దాదాపుగా 3 శాతం మంది సైలెంట్ ఓటర్లు ఉండగా ఈ ఓటర్లు ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలో కీలక పాత్ర పోషించనున్నారు. మరీ ముఖ్యంగా పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ సైలెంట్ ఓటర్లు గెలిచే పార్టీని డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారని చెప్పవచ్చు.
 
అయితే ఈ సైలెంట్ ఓటర్లు అంతా వైసీపీ పథకాల లబ్ధి పొందినవారే అని వాళ్లు వైసీపీ వైపే ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ 3 శాతం మంది ఎన్నికల ఫలితాలను మార్చేస్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ 3 శాతం మంది ఓటర్లు పూర్తిస్థాయిలో వైసీపీకి సపోర్ట్ చేస్తే వైసీపీకి సునాయాసంగా 140 స్థానాల్లో విజయం దక్కుతుందని తెలుస్తోంది.
 
ఆత్మసాక్షి చివరి సర్వే ఫలితాలు సైతం తాజాగా వెల్లడి కాగా వైసీపీ కనీసం 105 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడైంది. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా వర్షం కురుస్తున్నా ఓటర్లు క్యూలోనే వేచి ఉన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సైలెంట్ ఓటర్ల సపోర్ట్ తో జగన్ సులువుగా మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. 151 స్థానాలతో జగన్ మ్యాజిక్ రిపీట్ చేయకపోవచ్చు కానీ చెప్పుకోదగ్గ స్థానాలతో ఏపీలో వైసీపీ సంచలనాలు మాత్రం కొనసాగుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు అని చెబుతున్న జగన్ రాష్ట్రంలో వాళ్లే మళ్లీ తనను గెలిపిస్తారని భావిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ సునామీ ఖాయమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: