ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరు చూస్తే ఈసారి ఇక టైటిల్ గెలవడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే అనుమానం అందరిలో నిండిపోయింది. అయితే ఇలా మొదట్లో వరుస ఓటములతో సతమతమైనప్పటికీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది ఆ జట్టు. ఈ క్రమంలోనే వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని అంతకంతకు మెరుగుపరుచుకుంటుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఆరు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం.
ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది ఆర్సిబి జట్టు. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. అయితే మొదట్లో తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించిన దినేష్ కార్తీక్ మాత్రం వరుసగా విఫలమవుతూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుతిరిగాడు. దీంతో ఒక చెత్త రికార్డు అతని ఖాతాలో చేరిపోయింది ఐపీఎల్ లో ఇక అత్యధిక సార్లు డెకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు దినేష్ కార్తీక్. ఇప్పటివరకు 18 సార్లు ఇలా డక్ అవుట్ గా పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. అతని తర్వాత రోహిత్ 17, మ్యాక్స్‌వెల్ 17, నరైన్ 16, చావ్లా 16 డక్ అవుట్లతో తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి.