ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పోలింగ్ జోరు గా సాగుతుంది.. ఈసారి అత్యధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు. ఈ సారి తమ ఓటు హక్కును  వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ప్రజలలో అవేర్నెస్ తీసుకోని వచ్చింది. దీనితో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తెల్లవారిజాము నుంచే పోలింగ్ కేంద్రాలలో బారులు తీరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరం గా మారింది. అందులోను తెనాలి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.. ఈ సారి తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బరిలో నిల్చున్నారు..అలాగే వైసీపీ అభ్యర్థి శివకుమార్ బరి లో నిల్చున్నారు..జనసేన పార్టీకి ముఖ్య నాయకుడు అయిన నాదెండ్ల మనోహర్ కు అనేక నాటకీయ పరిణామాల మధ్య తెనాలి సీటు లభించింది.. 

జనసేన కూటమిలో భాగం కావటంతో ఇక్కడ కూటమి సీటు నాదెండ్లకు దక్కింది. తెనాలి నియోజకవర్గం లో వైసీపీ హవా కొనసాగుతుంది.. ప్రజలకు చేసిన మంచిని చూసి ఓటు వెయ్యండి అంటూ జగన్ చెప్పుకొచ్చారు.. జగన్ చేసిన మంచి కార్యకక్రమాలు మరోసారి ఆయననే అధికారంలోకి తీసుకువస్తాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. తెనాలి ప్రజలు ఇప్పుడు జగన్ వైపే వున్నారని తెలుస్తుంది. రాష్ట్రం లో చాలా మంది పేదలకు జగన్ ప్రభుత్వం ద్వారా ఎన్నో మంచి పథకాలు అందాయి.. సంక్షేమం తో పాటు అభివృద్ధి చేసిన వైసీపీ పార్టీ కే తెనాలి ప్రజలు మద్దతుగా నిలువనున్నారు. ఈ సారి తెనాలి లో ఫ్యాన్ గాలి దెబ్బకి గాజు గ్లాస్ కింద పడి పగిలిపోతుందని అక్కడి ప్రజలు అంటున్నారు.జనసేన అభ్యర్థి అయిన నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఘోరంగా ఓడిపోనున్నట్లు తెలుస్తుంది. ఈ సారి కూడా జగన్ అత్యధిక సీట్ల తో గెలవనున్నారని తెనాలి ప్రజలు భావిస్తున్నారు.ఈ సారి మనోహర్ తెనాలిలో మనోహర్ ఓడితే జనసేన పరిస్థితి ఏంటని చాలా మంది చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: