విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉంటారు. దానితో ఎన్నో సంవత్సరాలుగా పార్టీలు ఎక్కువ శాతం ఈ ప్రాంత ఎంపీ సీటును కమ్మ సామాజిక వర్గం నేతలకు ఇస్తూ వెళుతుంది. అందులో భాగంగా ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే గెలుస్తూ వస్తున్నారు. పోయిన సారి విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన కేసినేని నాని భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఆయన ఆ తర్వాత పార్టీ మారి వైసీపీ లోకి వచ్చారు.

ఇక వైసీపీ లోకి వచ్చాక కూడా ఈయనకు విజయవాడ ఎంపీ సీటును ఇచ్చారు. ఇకపోతే ఈయనపై పోటీగా కేశినేని శివనాథ్ చిన్ని కూటమి అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఇకపోతే వీరిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, అలాగే సొంత అన్నదమ్ములు కావడం వల్ల మొదటి నుండి కేశినేని నాని గన్ షాట్ విజయం అనుకున్నది కాస్త తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే నాని ఎక్కువ శాతం గొడవలకు, కాంట్రవర్సీ విషయాలకి దూరంగా ఉంటాడు. అలాగే కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా విజయవాడ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులను చేశాడు.

ఇక వైసీపీ పార్టీ వేవ్ బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో కూడా కేసునేని నాని టీడీపీ పార్టీ నుండి నిలబడి గెలిచాడు అంటేనే అర్థం అవుతుంది ఈయనకు ఈ ఏరియాలో ఎంత పట్టు ఉందో అనేది. కానీ తన సంత తమ్ముడే టీడీపీ పార్టీ నుండి పోటీలోకి దిగడంతో ఈయనకు కమ్మ సామాజిక వర్గ ఓట్లు కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు, దాని ద్వారా వీరిద్దరికీ గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది ఇక కొండ మీద ఉన్న అమ్మవారు చూస్తున్నారు. అమ్మవారు ఈ భారీ పోటీలో అన్నను గెలిపిస్తుందా..? లేక తమ్ముడిని గెలిపిస్తుందా అనేది రెండు, మూడు రౌండ్ల ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సమీక్షలో తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: