ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడినా ఇక్కడ వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తాయి. మొత్తం 14 నియోజకవర్గాల్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో వైసీపీనే సత్తా చాటే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో కర్నూలు, బనగానపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే కూటమికి ఎడ్జ్ ఉందని సమాచారం అందుతోంది.
 
అయితే ఒక మహిళ ఫ్యాన్ కు ఓటు వేయాలని వెళ్లగా అధికారి ఆమెతో సైకిల్ గుర్తుకు ఓటు వేయించారట. కర్నూలు నియోజకవర్గంలో సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆవరణలో ఉన్న 69వ పోలింగ్ బూత్ లో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. అనూష అనే మహిళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లగా తొలిసారి ఆమె ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చానని చెప్పారు.
 
అధికారులకు తాను ఇదే విషయం చెప్పగా తాను చెప్పిన ఫ్యాన్ గుర్తుకు కాకుండా మరో గుర్తుకు ఓటు వేయించారని మహిళ చెప్పుకొచ్చారు. అధికారులు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఒక పార్టీకి అనుకూలంగా పని చేసి సైకిల్ కు ఓటు వేయించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
 
వైసీపీ ఈ ఘటన విషయంలో ఒకింత సీరియస్ గా స్పందించాల్సిన అవసరం అయితే ఉందని ఆ పార్టీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే టీడీపీ అధికారులతో ఇలాంటి పనులు చేయిస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీడీపీ కుట్రలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది. కర్నూలులో జరిగిన ఈ ఘటన విషయంలో ఎన్నికల కమిషన్ కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: