అయితే ఈ సమయంలో కూడా అటు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు కూడా వారి కార్లలోనే ఉన్నట్లు సమాచారం. వారు అనుచరులు మాత్రం ఈ ఘర్షణ పడినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారం పోలీసులకు అందిన వెంటనే అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురు వర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.. ఆ తర్వాత ఇరువురు కార్యకర్తలు కూడా ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో ఈ గొడవలు సర్దు మునిగినట్లుగా తెలుస్తోంది. మరి ఓటింగ్ అయిపోయే సమయానికి మరిన్ని గొడవలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతానికైతే ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది..
మాచర్ల నియోజకవర్గం లో ఉండేటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 216,205,206,207 పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ నిలిచిపోయేలా చేశారు ముఖ్యంగా ఈవీఎంలను సైతం వైసీపీ కార్యకర్తలు కూడా పగలగొట్టినట్లుగా సమాచారం. దీంతో పోలింగ్ ఒక్కసారిగా నిలిపివేయడంతో అధికారులు కూడా భయంతో బయటికి వెళ్లిపోయారు. ఈ ఘటన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల అధికారులు సైతం పర్యావేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా చాలా ప్రాంతాలలో కూడా అటు వైసిపి టిడిపి పార్టీల మధ్య ఒక రసవత్తమైన పోరు కొనసాగుతూనే ఉంది.. ఇలా అయితే ఓటు వేయడానికి కూడా చాలామంది ఓటర్ల సైతం భయభ్రాంతులకు గురయ్యాలా ఉన్నారు.. ముఖ్యంగా టిడిపి ఓడిపోతుందని భయంతో ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.