120 నుంచి 130 స్థానాలలో వైసీపీ సత్తా చాటనుందని పోలింగ్ ముగిసిన తర్వాత పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. తాను చేసిన సంక్షేమమే తనను మళ్లీ గెలిపిస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలానే చూశారు. పిల్లలకు తాను మావయ్య అవుతానని ప్రేమగా తనను తాను పరిచయం చేసుకోవడం జగన్ కే సాధ్యమైందని చెప్పవచ్చు.
ఏపీలో పోలింగ్ అనంతరం పొలిటికల్ లెక్కలను సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి 3 వారాల సమయం ఉంది. జూ నెల 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం వెలువడనున్నాయి. ఆ ఫలితాలతోనే రాష్ట్రంలో వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయో సునాయాసంగా తేలిపోనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రాష్ట్రంలోని విద్యావ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చి ప్రతి పథకాన్ని చెప్పిన తేదీకి అమలు చేసిన ఘనత జగన్ సొంతం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ పథకాల అమలు విషయంలో మాట తప్పలేదని మడమ తిప్పలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని వాలంటీర్లే జగన్ ను మరోసారి గెలిపించబోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వాలంటీర్ల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్ కు పూర్తిస్థాయిలో మద్దతు లభించిందని వైసీపీకి వాలంటీర్లే సైన్యంగా అండగా నిలబడ్డారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి జగన్ నమ్మకం నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.