ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అనగా మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఎన్నికల ముందు వరకు నేతలు హోరా హోరీగా రాష్ట్రమంతా ప్రచారాలు చేశారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంచి చేసింది. మళ్లీ అధికారం ఇస్తే మిమ్మల్ని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్తాం అని ఒక పార్టీ, మాకు అధికారం ఇవ్వండి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ చేసిన మంచి పనుల కంటే మీకు మరింత మంచి చేస్తాం అని మరో పార్టీ ఇలా ఒక్కో పార్టీ ఒక్కో రకమైన హామీలను జనాలకు ఇస్తూ వారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు చేశాయి.

ఇక ఏది ఏమైనా ఎలక్షన్ లు నిన్నటి తో పూర్తి అయ్యాయి. ఇక జనాలు ఎవరిని నమ్మారు... ఎవరి వైపు నిలబడ్డారు అనేది తెలియాలి అంటే ఎలక్షన్ డే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లను వైసీపీ పార్టీ దక్కించుకుంది. కానీ ఆ తర్వాత కృష్ణ, గుంటూరు సమీపంలో ఉన్న అమరావతిని మాత్రమే రాజధాని కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీపీ పార్టీ తీసుకురావడంతో కృష్ణా జిల్లాలో వైసీపీ కి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది అని ఎంతో మంది అంచనా వేశారు.

కానీ అనూహ్యంగా వైసీపీ కే భారీ మొత్తంలో సీట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో మొత్తం పామర్రు , గన్నవరం , గుడివాడ , అవనిగడ్డ , పెనమలూరు , పెడన , మచిలీపట్నం అని ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా ఐదు నియోజక వర్గాల వరకు వైసీపీ కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2 మాత్రమే టీడీపీ కి వచ్చే అవకాశం ఉంది అని కొంచెం అటు ఇటు అయితే అందులో ఒకటి తగ్గినా పెద్దగా ఆశ్చర్యం లేదు అని తెలుస్తుంది. మరి ఈ లెక్కలు ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మాత్రం రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుత సమీకరణలు మాత్రం కృష్ణా జిల్లాలో ఫ్యాన్ గాలే వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: