నిన్న అనగా మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక దేశం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నాలుగవ విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్నటి ఎన్నికలు జరిగాయి . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో టీ డీ పీ పార్టీ అత్యంత మెజారిటీ సీట్ లను దక్కించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది . ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఇకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కూడా అభ్యర్థులకు విజయాలను డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది మహిళలు. ఎందుకు అంటే మొదటి నుండి మహిళా శక్తి పెద్దది అని చెబుతూనే వస్తున్నాం. ఓట్లు వేయడానికి మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్లు ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ వస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య 2,03,39,851 గా   ఉంటే ... మహిళా ఓటర్ల సంఖ్య 2,10,58,615 గా ఉంది.

ఇలా ఓట్ల సంఖ్య పరంగా చూసుకున్నట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇక పోల్ అయిన పర్సంటేజ్ ప్రకారం చూసుకున్న పురుషుల కంటే మహిళల శాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరు అనేదాన్ని క్లియర్ గా మహిళలే నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. మరి మహిళలు ఎవరి సైడ్ నిలబడ్డారు..?  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏది అనేది తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: