నిజానికి ఈసారి తప్పనిసరిగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని సర్వేలు రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్పారు. కానీ ఎంత మెజారిటీతో ఆయన గెలుస్తారనేదే సస్పెన్స్ గా మారింది. జగన్ మాత్రం తనకు 2019లో లాగానే తనకు ఈసారి కూడా 150 దాకా సీట్లు వస్తాయని అంటున్నారు. అంత బలమైన నమ్మకం ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాల వల్ల వృద్ధులుగా ఆడవాళ్లు చాలా లబ్ధి పొందారు. వారందరూ జగన్‌కు విధేయులుగా మారారు. పోలింగ్ స్టార్ట్ అయినా వెంటనే లైన్లలో నిలుచును మరీ ఓట్లు వేశారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వేచి ఉండి మరీ జగన్ నుంచి సీఎం చేసుకోవడానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వారందరూ ఈ రేంజ్ లో ఓట్లు వేశారు కనుక జగన్ తను ఈసారి భారీ మెజారిటీతో గెలవగలను అని నమ్ముతున్నారు. ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై పీకలు దాకా కోపం ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో సంక్షేమ పథకాలను చంద్రబాబు ఆపించారు. అలానే వాలంటీర్ వ్యవస్థను చిన్నభిన్నం చేశారు. ఆ టైంలో పెన్షన్ కోసం చాలామంది వృద్ధులు లైన్ లో నిల్చోవలసి వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే తమకు ఇలాంటి దుస్థితి వస్తుందని వారు భయపడ్డారు. వాళ్లంతా కూడా జగన్‌కే ఓటు వేసి ఉంటారు.
ఈ వృద్ధుల డబ్బులతో మెడిసిన్ కొనే వారు కూడా చంద్రబాబు చేసిన పని వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఓట్లు కూడా జగన్‌కే పడతాయి. చంద్రబాబు పాలన వల్ల విసుగు చెందినవారు, పూర్తి రుణమాఫీ జరగని కారణంగా ఇబ్బంది పడినవారు, జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు చాలు చంద్రబాబు ఏమీ ఇయ్యరు అని నమ్మిన వారందరూ కూడా వైసీపీకే ఓటు వేసి ఉంటారు. ఇంత నెగిటివిటీ ఉండటమే తామ గెలుపుకు కారణం అవుతుందని జగన్ బలంగా నమ్ముతున్నట్టు సమాచారం.