ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బలగంతో అక్కడ చేరుకొని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కొద్దిసేపటికి అక్కడ పరిస్థితి సాధారణంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ అల్లర్లు చెలరేగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మొదట వైసీపీ నేతలు తమ పైన దాడి చేశారంటూ కూడా చెప్పారు.కానీ వైసీపీ నేతలు మాత్రం తమ ఇళ్లను టిడిపి నేతలు కూలగొట్టినట్లుగా తెలియజేస్తున్నారు. దీంతో రాత్రి మొత్తం వారు స్థానిక గుడిసెలలో పోలీసు బందోబస్తు మధ్య తలదాచుకున్నామని వెల్లడించారు.
అయితే ఈ రోజున మరొకసారి టిడిపి నేతలు భారీ ఎత్తున ఆ గ్రామాన్ని చుట్టుముట్టినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే కాసు బ్రహ్మానంద రెడ్డి, అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకోగా మరొక సారి అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారిపోతోంది. ముఖ్యంగా క్యాన్వాన్ పైన రాళ్లు ఇవ్వడం కర్రలతో దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయాలు ఉలిక్కిపడ్డాయి.. దీంతో బలగాలు సైతం అక్కడికి చేరుకొని అదుపుతప్పిన పరిస్థితిని చూసి గాలిలోకి కాల్పులు జరిపారు.. అలాగే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు స్థానికులను కూడా కేంద్ర బలగాలతో తరలించినట్లు సమాచారం. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పల్నాడులో ఆంక్షలు కొనసాగించారు అంటూ పోలీసులు సైతం ప్రజలకు సూచన ఇచ్చారు. పల్నాడు లో ఏ క్షణం ఏం జరుగుతుందో అంటూ అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.