ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీకి భారీ మెజారిటీ రావడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక వీరు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు అనే నేపథ్యంలో కృష్ణ, గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో అమరావతి నగరాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. అందులో భాగంగా ఇక్కడి రైతుల నుండి కొన్ని భూములను కూడా తీసుకొని అక్కడ కొన్ని అభివృద్ధి పనులను కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టింది.

ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అధికారం పోయి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక వీరు అమరావతి ఒకటే కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదికను తెరపైకి తెచ్చారు. దానితో అమరావతి ప్రాధాన్యత తగ్గింది. ఇక వైసీపీ అమరావతిని రాజధాని కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తేవడంతో కృష్ణ , గుంటూరు జిల్లా వాసులు వైసీపీ పార్టీ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానితో కృష్ణా జిల్లాలో టీడీపీ ఈ సారి భారీ మొత్తంలో సీట్లు వస్తాయి అని అంతా భావించారు.

కానీ ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ కి పెద్ద మొత్తంలో కృష్ణా జిల్లా నుండి సీట్లు వచ్చే అవకాశం తక్కువే అని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మొదటి నుండి కూడా పామర్రు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ , వైసీపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడి ప్రజలు చెబుతూ వస్తున్నారు. ఇక మే 13 వ తేదీన ఎలక్షన్లు పూర్తి అయ్యాయి. ఎలక్షన్ల తర్వాత కూడా ఇక్కడ భారీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్ బరిలో ఉండగా ... టీడీపీ పార్టీ నుండి వర్ల కుమార్ రాజా బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొని అవకాశాలు ఉన్నట్లు కానీ చివరి నిమిషంలో అనిల్ కుమార్ కే విజయం దక్కే అవకాశాలు ఉన్నట్లు అక్కడి ప్రజలు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kak