బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాతో భారతదేశ వ్యాప్తంగా సూపర్ బాపులర్ అయింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన లింగ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఫిమేల్ లీడ్ రోల్ చేసి ఆకట్టుకుంది. సోనాక్షి సిన్హా దబాంగ్ లాంటి పెద్ద హిట్ వచ్చాక కూడా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. సక్సెస్ ల కోసం ఆమె పాకలాడుతూ నచ్చిన సినిమాలకు మాత్రమే సైన్ చేస్తుంది అందుకే తక్కువ సినిమాలు చేసింది. ఇటీవల డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కూడా ఈ ముద్దుగుమ్మ అడుగు పెట్టింది. దిగ్గజ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి రూపొందించిన ‘హీరమండి: ది డైమండ్ బజార్" సిరీస్‌లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది.

ఈ వెబ్‌సిరీస్ కొన్నేళ్ల క్రితం లాహోర్‌లోని ఓ రెడ్ లైట్ ఏరియాలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది. సోనాక్షి రెహానా అనే షాహీ మహల్ మాజీ ప్రధాన వేశ్యగా నటించి మెప్పించింది. ఈ సిరీస్ కారణంగా ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ తార నిర్మాతల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి. నటీమణుల పారితోషికం వద్దకు వచ్చే సరికి కూరగాయల వ్యాపారుల వలె నిర్మాతలు బేరసారాలు ఆడతారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

రెమ్యునరేషన్స్‌ తగ్గించుకోవాలి అంటూ చెత్త చెత్తగా నిర్మాతలు ప్రశ్నలు అడుగుతారని ఆమె తెలిపింది. నిర్మాతలు ఎక్కువమంది నటీమణులకు ఛాన్స్ ఇవ్వడానికి మొగ్గు చూపుతారు కానీ డబ్బు విషయంలోనే వెనకాడతారు అని చెప్పింది. ఇకపోతే దబాంగ్ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ చేసిన ‘అకీరా’, ‘నూర్’, ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’ వంటి సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమాల కోసం తాను ఎంతో కష్టపడ్డాను కానీ ఒకటి కూడా సక్సెస్ కాలేదని, అందుకే రోల్స్ విషయంలో నిర్ణయం మార్చుకున్నాను అని చెప్పింది. ఒక నటీమణిగా తాను ప్రతి సినిమాను ఎంజాయ్ చేశానని, అవి సక్సెస్ కాలేదనే బాధ తప్ప మిగతా అన్ని విషయాల్లో సంతృప్తి కరంగా ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: