తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముగిసాయ్. దీంతో జూన్ 4వ తేదీన విడుదల కాబోయే ఎన్నికల ఫలితాలలో ఎవరు విజయం సాధిస్తారో అని ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో విపరీతమైన క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నది అటు రాజకీయ విశ్లేషకులు అంచనా. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్.


 ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలను కీలక నేతలందరినీ కూడా హస్తం పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయింది. ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ లోకి రాబోతున్నారు అంటూ ఇప్పుడేకే ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అటు పార్లమెంట్ ఎన్నిక బిఆర్ఎస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోవడంతో కనీసం ఎన్నికల్లో నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోవడంతో పాటు పార్టీలో ఉన్న మిగతా నేతల్లో కూడా పార్టీపై ఆత్మవిశ్వాసం పోతుంది.


 మరోవైపు ఇప్పటికే అసెంబ్లీలో అది గెలిచి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ని గెలిస్తే ఇక బిఆర్ఎస్ ను ముప్పు తిప్పలు పెడుతుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు తక్కువ సీట్లు వచ్చిన పర్వాలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం మెజారిటీ స్థానాలలో విజయం సాధించొద్దనె లక్ష్యాన్ని పెట్టుకుందట బిఆర్ఎస్. ఈ క్రమంలోనే కారు పార్టీ నే క్రాస్ ఓటింగ్ చేసింది అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ మంచి పేరున్న  నాయకులను బరిలోకి దింపలేకపోయింది బిఆర్ఎస్. మెదక్, భువనగిరి, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి, చేవెళ్ల, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పార్లమెంట్ నియోజకవర్గం లో బలమైన అభ్యర్థులను బలిలోకిదింపలేదు. ఒకరకంగా కొన్ని చోట్ల బరిలోకి దింపిన అభ్యర్థులు అప్పటివరకు ఎవరికీ తెలియదు కూడా.


 ఇలాంటి అభ్యర్థులను బరిలోకి దింపి ఇక బిఆర్ఎస్ కు ఓటు వేయకపోయినా పర్వాలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం గెలవద్దు. కారు పార్టీకి వెయ్యకపోతే కమలానికి గుద్దేయండి. కానీ కాంగ్రెస్కు మాత్రం అస్సలు వేయకండి అని కారు పార్టీ నేతలే ప్రచారంలో చెప్పారు అనే టాక్ నడుస్తుంది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిస్తే తమకు తిప్పలు తప్పవు అని భావించి.. ఇక బిజెపికి ఎక్కువ సీట్లు గెలిపించాలని ఆయా  పార్లమెంట్ నియోజకవర్గాలలో బిఆర్ఎస్ అభ్యర్థులు సైతం లోలోపల ప్రచారం చేశారట. గ్రౌండ్ లెవెల్ బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇదే చేశారని టాక్. ఇలా బిఆర్ఎస్ చేసిన క్రాస్ ఓటింగ్ ఇప్పుడు బిజెపికి కలిసి వస్తుందని. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే బీజేపీ  ఎక్కువ స్థానాలలో విజయం సాధిస్తుందని.. తద్వారా ఇండైరెక్టుగా కారు పార్టీకి లాభం చేకూరుతుందని.. అందుకే గులాబీ పార్టీ నేతలు కార్యకర్తలు ఇలా క్రాస్ ఓటింగ్ చేశారు అంటూ ఒక టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: