ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీనే అధికారం చేపడుతుందట. 2004 ఎన్నికల నుంచి ఈ సెంటిమెంట్ చాలా రిపీట్ అవుతూ వస్తోంది.. ఈ సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీ వైసిపి అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి కావడం చేత .. అలాగే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం చేత ఇద్దరు కూడా రాయలసీమ వ్యక్తులే కావడం ఇక్కడ గమనార్హం.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి.. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మూడవ ఎన్నిక ఇది 2014లో జరిగిన ఎన్నికలలో టిడిపి పార్టీ గెలవగా.. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అధికారం దక్కించుకుంది .గడిచిన ఐదేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను అందించిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉంటున్నారు. ఇటీవలే ఈనెల 13వ తేదీన పోలింగ్ ముగిసింది.. పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదు అయినట్టుగా తెలుస్తోంది.


ముఖ్యంగా రాయలసీమలో వైయస్ కుటుంబానికి మంచి పేరు ఉండడం చేత ఆ కుటుంబం నుంచి ఎవరి నిలబడ్డా కూడా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే షర్మిల కూడా తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలని చేపట్టి తను కూడా ఎంపీగా నిలబడింది.. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.. ముఖ్యంగా రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలలో ఎవరు ఎక్కువ స్థానాలను సంపాదించుకుంటారో ఖచ్చితంగా వారు సీఎంగా అయ్యే అవకాశాలు 90% వరకు ఉంటాయి.. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, టిడిపి, వైసిపి పార్టీలన్నీ కూడా రాయలసీమ తోనే వచ్చిన అసెంబ్లీ సీట్లతోనే విజయాలను అందుకున్నారు.


ఈసారి కూడా ఖచ్చితంగా వైసిపి పార్టీనే రాయలసీమలో ఎక్కువ స్థానాలను గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంత ధీమాతో ఉన్నారని.. వైసీపీ పార్టీ నేతలు కూడా అంతే ధీమాతో ఉన్నట్లు సమాచారం. 2019లో 49 స్థానాలలో వైసీపీ పార్టీ విజయకేతాన్ని ఎగురవేసింది. మరి ఈసారి కూడా అంతకుమించి స్థానాలను సాధిస్తామనే విధంగా ధీమాతో ఉన్నారు. అంతే ధీమాతో చంద్రబాబు కూడా ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే సీమ ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారికి సీఎం యోగ్యం అని లేకపోతే అంతే అని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: