అలాంటివారు నిలబడ్డప్పుడు 151 కంటే ఎక్కువ సీట్లు ఒక్క పార్టీయే గెలుచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సర్వేలు కూడా జగన్ పార్టీ 117-121 మధ్యలో మాత్రమే సీట్లు గెలుచుకుంటుందని చెబుతున్నాయి. జగన్ తప్ప మిగతా వైసీపీ నాయకులు ఎవరూ కూడా భారీ మెజారిటీతో తాము గెలవబోతున్నామని ధైర్యంగా ప్రకటించలేకపోతున్నారు. కొడాలి నాని వంటి ప్రముఖ వైసీపీ నాయకులు కూడా తాము ఫలానా మెజారిటీతో కలవబోతున్నామని ధైర్యంగా ప్రకటన ఇవ్వలేకపోయారు. వైసీపీ నేతలలో భయం ఉంది కాబట్టే వారు సైలెంట్ గా ఉండిపోయారు అని ఒక ప్రచారం జరుగుతోంది.
అయితే వీరిని పందెం రాయుళ్లు మరింత భయపెడుతున్నారట. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ 130-150 స్థానాలను గెలుచుకుంటుందని వీళ్లు నమ్మారట. పోలింగ్ సమయంలో 90, ఎన్నికల పోలింగ్ తర్వాత 73 నుంచి 75 వరకు మాత్రమే వైసీపీ విన్నయ్యే ఛాన్స్ ఉందనే ఒక అంచనాకి వచ్చారట. ఈసారి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయం అని వారు నమ్ముతున్నారట. ఆ ధీమాతోనే పందేలు సాగుతున్నాయని సమాచారం. భీమవరం, కడప, నెల్లూరు లాంటి ప్రాంతాలలో టీడీపీ+ ఎన్ని అసెంబ్లీ సీట్లను విన్ అవుతుందనే దానిపై బెట్టింగ్స్ నడుస్తున్నాయని వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
టీడీపీ ఓడిపోతుందని ఎవరైనా పందెం వేస్తే వారికి వ్యతిరేకంగా రూపాయికి నాలుగు రూపాయలు ఇస్తామని వేరే వాళ్లు బెట్టింగ్ వేస్తున్నారట. అంటే టీడీపీయే గెలుస్తుందని వారు అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. టీడీపీ ఒక్కటే 89 నుంచి 92 సీట్లను, కూటమి 104 నుంచి 107 వరకు సీట్లను గెలుచుకుంటుందని బెట్టింగ్ చేసేవారు నమ్ముతున్నారట. తేనె ఆధారంగా వాళ్ళు అలా అలాంటి నమ్మకానికి వచ్చారు అనేది తెలియాలి. కానీ వైసీపీ విజయం పై డౌట్ ఉన్నవారికి వీరి ధోరణి వల్ల మరింత భయం కలుగుతోందని తెలుస్తోంది.