టీడీపీ అనుకూల మీడియా పత్రికలలో జగన్ పాలన గురించి ఏం రాసినా ఏపీ ప్రజలు ఆ వార్తలను నమ్మే పరిస్థితులు లేవు. ఆ రెండు పత్రికల్లో వైసీపీకి అనుకూలంగా ఎంత మంచి పని చేసినా ఒక్క వార్త కూడా రాదని జగన్ అభిమానులకు తెలుసు. జగన్ మళ్లీ గెలిస్తే ఏపీ ప్రజలు మరోసారి సంక్షేమ పాలనకే ఓటేశారని క్లారిటీ వచ్చేసినట్టు అవుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీని బట్టి ఏపీ రాజధాని డిసైడ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఏపీలో జగన్ గెలిస్తే విశాఖ దశ తిరిగినట్లేనని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏపీకి జగన్ సీఎం అయితే వచ్చే ఐదేళ్లలో 13 మెడికల్ కాలేజ్ లతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. జగన్ మళ్లీ సీఎం అయితే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు పెద్దగా నిబంధనలు లేకుండానే ఇప్పుడు అమలైన పథకాలన్నీ అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
జగన్ మళ్లీ సీఎం అయితే జగన్ ను కావాలని టార్గెట్ చేసిన వాళ్లకు మాత్రం ఇబ్బందులు తప్పవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కూటమి అధికారంలోకి వస్తే మాత్రం జగన్ ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకింత టఫ్ ఫైట్ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.