రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లలో కరువు పరిస్థితులు ఎప్పుడూ లేవని రైతులు చెబుతున్నారు. బాబు సీఎం అయితే కరువు పరిస్థితులు ఉంటాయని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో తుఫాన్ రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో రైతులు ఎంతో సంతోషిస్తున్నారు. రైతాంగం వాన సెంటిమెంట్ నిజం అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి కొందరు మాత్రం ఈ వాన సెంటిమెంట్ ను అంగీకరించడం లేదు. జగన్ లండన్ ను పర్యటనను పూర్తి చేసుకుని ఈ నెల 28న రిటర్న్ కానున్నారని సమాచారం.
ఎన్నికల ఫలితాలకు సంబంధించి టెన్షన్ అక్కర్లేదని జగన్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం అందుతోంది. జగన్ 151 సీట్లలో పార్టీని గెలిపిస్తారని చెప్పలేం కానీ 100కు పైగా స్థానాలలో వైసీపీకి విజయం సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. వైసీపీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో చూడాల్సి ఉంది. జగన్ సీఎం అయితే మాత్రమే ఇప్పుడు ఉన్న పథకాలు కొనసాగుతాయని తమ బ్రతుకు చిత్రాలు మారతాయని చాలామంది మహిళా ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. జగన్ మళ్లీ సీఎం అయితే తమకు మంచి జరుగుతుందని వాళ్లు విశ్వసిస్తున్నారు.