ప్రెసెంట్ ఏపీలో ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. తమ పార్టీని సపోర్ట్ చేస్తూ ఆపోజిట్ పార్టీపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు రాజకీయ నేతలు. ఇక పలువురు అయితే.. చట్టాన్ని లెక్కచేయకుండా తమకి నచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లుడవ్వక ముందే జనసేన పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సంపర  నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అని శెట్టి ‌ బుల్లబ్బాయి రెడ్డి మంగళవారం స్వగ్రామం అయినా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు. సత్తుపల్లి మండలం నాగులపల్లి లో ఉదయం కన్నుమూశారు.


గత కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా సంపర ‌ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఈయ‌న‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న జనసేన మరియు కాంగ్రెస్ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2014 మార్చ్ 14న జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఈ పార్టీని స్థాపించిన మొదట్లో ఈయనకి మద్దతుగా నిలిచేందుకు పెద్దగా ఎవరు ముందుకు రాలేదు.


దశాబ్ద కాలం నుంచి ఒంటరి పోరాటం చేసుకుంటూ వచ్చారు. అనంతరం ఈయన చేసే మంచి పనులకు పలువురు మద్దతుగా నిలబడుతూ.. జనసేన పార్టీలో చెయ్యి కలిపారు. ఆపోజిట్ పార్టీల ఎమ్మెల్యేలను సైతం తన సొంతం చేసుకున్నాడు పవన్. అలా మొదట బుల్లబ్బాయి రెడ్డి సైతం కాంగ్రెస్లో ఉన్నప్పటికీ.. అనంతరం పవన్ చేసే మంచి పనులను మెచ్చి జనసేన పార్టీతో చేయి కలిపారు. ఇక ఈయన జనసేన పార్టీలోకి అడుగుపెట్టిన అనంతరం మరింత మంచి పేరును సంపాదించుకున్నారు. కానీ అనూహ్యంగా ఇలా మృతి చెందడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు అటు జనసేన పార్టీ నేతలను కూడా తీవ్ర బాధకు గురిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: