![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_gossips/pawan-kalyane410dbc5-42eb-430b-908e-9694e2688ad0-415x250.jpg)
ఇంకా అంతేకాదు.. ఈ క్రమంలో కీలక నాయకులు పోతిన మహేష్ వంటివారు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా కూడా ఇంకా ముద్రగడ పద్మనాభం వంటి వారు.. తీవ్ర విమర్శలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ వాటిని తట్టుకుని ముందుకు సాగారు. ఇక, కూటమి ప్రచారానికి కూడా ఎంతో కష్టపడి ఊపు తెచ్చారు. ముందుండి తనే స్వయంగా ప్రచారం చేశారు. అప్పటి దాకా గెలుపు అంచనాలపై ధీమాతో ఉన్న వైసీపీని ఒక్కసారిగా పవన్ డిఫెన్స్‌లో పడేశారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీకి ఓటమి భయాన్ని పవన్ చూపించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనలోని యూత్‌ను కూడా ఉరకలెత్తించారు. కూటమి నిలబడేందుకు వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ సహకరించాడు. అలాంటి పవన్‌ను ఇప్పుడు తక్కువ చేసి చూపించేందుకు కూటమిలో ఆయన ప్రభావాన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. అయితే ఇలా తక్కువ చేసి ఏం సాదిస్తారు? అనేది ప్రశ్న. కూటమి గెలిచినా.. ఓడినా.. పవన్ కళ్యాణ్ కి మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గదు. పవన్ కళ్యాణ్ ను మైనస్ చేస్తే.. అది కూటమి పార్టీలకే మరింత ఇబ్బందిగా మారుతుందనేది ముమ్మాటికి వాస్తవం.