ఉదయం జరిగిన పోలింగ్ సమయంలో చాలా వరకు ఓట్లు టీడీపీ కూటమికే పడ్డాయని అంటున్నారు. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు, వృద్ధులు పేదలు వైసీపీకి ఓట్లు వేశారని సమాచారం. మనం చేయ రాత్రి వరకు ఓటర్లు ఇరు వర్గాల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని టాప్ నచ్చింది. ఆ డబ్బుల కారణంగా ఓటర్ తన అభిప్రాయం మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఎవరు డబ్బులు ఎక్కువ ఇచ్చారు ఎవరు ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగారనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గానే మారింది.
బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ ప్రజలు చాలా సైలెంట్ ఓటింగ్ వేశారు. వీరు ఎవరికీ ఓట్లు వేశారు అనేది వైసిపి నేతల్లో ఇప్పుడు గందరగోళంగా మారింది. ఇవన్నీ వైసీపీ నేతలకు పడాల్సిన ఓట్లు కానీ టీడీపీ మంచి రాత్రి సమయంలో వారిని మార్చేసినా మార్చేస్తుంది. ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా పడితే వారిదే విజయం అని చెప్పవచ్చు. నాలుగో తేదీన ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఇరు వర్గాల నేతలలో టెన్షన్ అనేది కొనసాగుతూనే ఉంటుందని అనడంలో సందేహం లేదు.