కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ తాజాగా బిజెపి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల జరిగిన సరళిని బట్టి ఆంధ్రప్రదేశ్లో బిజెపి ఒక్క సీటు కూడా గెలవలేదని చర్చ తెరమీదకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కూటమిలో భాగంగా టిడిపి, జనసేన పొత్తులో బిజెపి మొత్తం 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసింది. ఈ విషయం తెలిసిందే.. కానీ నిజానికి బిజెపి పార్టీకి అంత బలం ఆంధ్రప్రదేశ్లో లేదని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా టిడిపి,జనసేన ఓట్లు ఎంతవరకు బిజెపి పార్టీకి బదిలీ అయ్యాయనే అంచనా మేరకు  చర్చనీయాంశంగా మారింది అంటూ చింతామోహన్ వ్యాఖ్యానించారు.


ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ, అమిత్ షా, సీఎం జగన్ భేటీ అయ్యారని అనంతరమే రాష్ట్రంలో బిజెపి పొత్తు కుదురుచుకున్నదంటూ తెలిపారు. వాళ్ళ మధ్య జరిగిన చర్చను బట్టి బిజెపి ఎక్కువ స్థానాలను డిమాండ్ చేసినట్లుగా కూడా చాలామంది విశ్లేషకులు తెలియజేస్తున్నారని తెలిపారు.. చంద్రబాబు అరెస్టు వెనుక కూడా బీజేపీ పెద్దల హస్తం ఉందని ప్రచారం కూడా జరిగిందని ఈ విషయం పైన టిడిపి తమ్ముళ్లు కూడా చాలా కోపంగా ఉన్నారని వెల్లడించారు..


అందువల్లే కూటమిలో బలమైన టిడిపి శ్రేణులు బిజెపికి సైతం చిత్తశుద్ధితో ఓటు వేశారా లేదా అనే విషయాలు కూడా అనుమానాలు రేకెక్కుతున్నాయని తెలుపుతున్నారు. బిజెపి పోటీ చేసే సీట్లలో ఎన్ని గెలుస్తుంది అనే విషయం పైన చర్చనీయాంశంగా ఉందంటూ చింతామోహన్ వెల్లడించారు. ఈరోజు జగన్ విదేశాల నుంచి రాబోతున్నప్పటికీ నిన్నటి రోజున తన ట్విట్టర్ నుంచి పోలింగ్ సరలిను బట్టి తామే అధికారంలోకి వస్తామని చెప్పారు.. మరి జగన్ గెలుస్తానని ట్విట్ చేయడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తి రేపేలా చేస్తోంది. రేపటి రోజున ఎగ్జిట్ ఫలితాలను సైతం తెలియజేస్తున్నారు జూన్ 4వ తేదీన ఫలితాలు క్లియర్ గా వెలుపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: