గెలుపు గుర్రాలు ఎవరో ఫలితాల విడుదల ప్రారంభమైన తొలి రెండు గంటల్లో ప్రజలకు స్పష్టత రావొచ్చు. ఒక్కోసారి గెలుపు గుర్రాలు కూడా తొలుత వెనుకబడినా, తర్వాత చివర్లో గట్టెక్కే పరిస్థితి ఉంది. ఇక గత ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఇదే తరహాలో గెలిచారు. దీంతో అలాంటి నియోజకవర్గాల్లో చివరి వరకు ఫలితం తేలే అవకాశం లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి దాదాపు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉండే అవకాశం ఉంది. అయితే 20 రౌండ్లలో ఫలితం వచ్చే నియోజకవర్గాలు ఏపీలో 11 ఉన్నాయి. అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఆ నియోజకవర్గాల్లో ఫలితం కొలిక్కి వస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 88ను ఆయా పార్టీలు సాధించాలి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకే అధికారం చేపట్టబోయేది ఎవరో తేలిపోనుంది. 61 నియోజకవర్గాల్లో మాత్రం 21 నుంచి 25 వరకు రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అంటే మొత్తం ఫలితాలు పూర్తిగా విడుదలయ్యేందుకు సాయంత్రం 4 గంటల వరకు ఎదురు చూడక తప్పదు. ఇక సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైఎస్ జగన్ ఆశగా ఉన్నారు. మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాక వారు కూడా బలంగా కనిపిస్తున్నారు. వివిధ సర్వే సంస్థల్లో కొన్ని వైసీపీకి, మరికొన్ని కూటమికి విజయావకాశాలు ఉన్నాయని తేల్చాయి.