
అలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడి నుంచి రఘురామరాజు పోటీ చేయడంతో అందరికన్ను ఈ అసెంబ్లీ నియోజకవర్గం పైన పడింది. సాధారణంగా అయితే ఏ నియోజకవర్గంలో చూసిన ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. కానీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో 86.20 శాతం ఉండిలో పోలింగ్ నమోదయింది. కానీ ఇక్కడ మాత్రం ద్విముఖ పోటీ లేదు.
మిగతా నియోజకవర్గాలలో వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. కానీ నాలుగు స్తంభాలాట అన్నట్లుగానే ఉండి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఏకంగా నలుగురు కీలక నాయకులు బరిలో నిలిచారు. వీరిలో ముగ్గురు కూడా ప్రధాన పార్టీలకు చెందిన వారే కాగా.. ఇక మరోవైపు ఇండిపెండెంట్గా కూడా ఒకరు బరిలో నిలిచారు వైసిపి నుంచి పివిఎల్ నరసింహారాజు బరిలో ఉన్నారు. ఇక టిడిపి నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందా అని కన్ఫ్యూషన్ నెలకొన్న సమయంలో చివరి నిమిషంలో రఘురామ ఆ ఛాన్స్ దక్కించుకున్నారు. దీంతో రఘురామ, పివిఎల్ నరసింహారాజు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తనకు టికెట్ దక్కలేదని మాజీ ఎమ్మెల్యే వేటకూరి శివరామరాజు, కలవపూడి శివ ఇండిపెండెంట్గా రంగంలోకి దిగారు. వీరు కూడా మంచి అంగ అర్థ బలం ఉన్న నాయకులే. అయితే కలవపూడి శివకు గత ఎన్నికల్లో ఓడిపోయారని సానుభూతి. ఇక మరోవైపు అంగ అర్థబలం.. ఇక ఇప్పుడు టికెట్ దక్కలేదన్న సానుభూతి కూడా కలిసి వచ్చాయని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో రఘురామరాజు అందరినీ తన వైపు ఉంచుకునేందుకు భారీగానే పార్టీలు ఇచ్చారని.. రాజులను మచ్చిక చేసుకునేందుకు డబ్బులు పంచారంటూ టాక్ కూడా ఉంది. దీంతో ఈ నాలుగు స్తంభాలాటలో రఘురామకు విజయం వరిస్తుందా లేదా అనే విషయంపై విశ్లేషకులు సైతం కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు.