2019లో ముప్పై సీట్లు ఇప్పుడు ఆ టిడిపి గెలుచుకోలేకపోయింది అప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది అనుకున్నారు ఆ తర్వాత జగన్ దూకుడుకు చంద్రబాబు రాజకీయాల్లో లేకుండా పోతారని అందరూ అనుకున్నారు కానీ ఆ క్రమంలో జనసేన టిడిపిలో కలవడం బీజేపీ కూడా పొత్తు కుదుర్చుకోవడం జరిగింది దానివల్ల ఈ టీడీపీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. ఇప్పుడు చాలామంది టీడీపీ 120 నుంచి 130 వరకు సీట్లు గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్లు చేస్తున్నారు. 18 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఆ రేంజ్ లో ఈ పార్టీ బలంగా స్థాయికి రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు.
కానీ టీడీపీ అనుమానాల కారణంగా బాగా టెన్షన్ పడుతోంది. మనకి ఏ సెక్షన్ వారు ఓట్లు వేశారు? పేదలు మన వైపే ఉన్నారా? సంక్షేమ పథకాలు పొందిన వారు ఎక్కువ సంక్షేమ పథకాల కోసం తమకు ఓట్లు వేశారా? చదువుకున్న వాళ్ళు ఎటు ఓట్లు వేశారు? ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఎవరికిపడి ఉంటాయి? ఏ సెక్షన్ వాళ్ళు తమకు ఓట్లు వేశారు అని ఇలా రకరకాల ప్రశ్నలు వారికి వారే సంధించుకుంటున్నారట. వృద్ధులు ఎక్కువ టెన్షన్ కోసం తమకే ఓట్లు వేసి ఉంటారని చంద్రబాబు అనుకుంటున్నారు. అనుకున్నంత మాత్రాన ఆ ఓట్లు పడిపోయి ఉండవు కదా. అందుకే వారిలో చాలా భయం కలుగుతున్నట్లు తెలుస్తోంది.