గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై కూటమి ఆశలు పెట్టుకోగా ఈ నియోజకవర్గాల్లో ఫలితం రివర్స్ అయితే మాత్రం వైసీపీ సులువుగా విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రిజల్ట్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో టెన్షన్ పెంచుతున్నాయి. పైకి అన్ని పార్టీల నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం భయాందోళనతోనే ఉన్నారు.
ఎన్నికల్లో గెలవకపోతే తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నకు చాలామంది నేతల దగ్గర జవాబు లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2009లో కాంగ్రెస్ బొటాబొటీ మెజార్టీతో ఉమ్మడి ఏపీలో విజయం సాధించినట్లుగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని జగన్ నమ్మకాన్ని కలిగి ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఎన్నికలు వైసీపీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూటమి నేతలు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎంత కష్టపడినా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం తమకు అనుకూలంగా రావని కూటమి నేతలు ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. కూటమి నేతలకు ఈ ఎన్నికల్లో భారీ షాకులు తగులుతాయేమో చూడాల్సి ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం చాలామంది నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. వైసీపీ గెలిస్తే మాత్రం కూటమి పరువు పోతుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే ఆప్షన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.