ప్రస్తుత రోజులలో యూపీఐ పేమెంట్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా యూపీఐ పేమెంట్ చేయడం చాలా సులువుగా, తొందరగా పేమెంట్స్ అవ్వడంతో అందరూ దీనిపైనే మొగ్గు చూపుతున్నారు. యూపీఐ పేమెంట్స్ విధానం ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి ఇతరులకు డబ్బులు సులువుగా బదిలీ చేయవచ్చు. యూపీఐ పేమెంట్స్ విధానాన్ని అమలు చేయకముందు ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఆర్టిజిఎస్, ఐఎంపీఎస్, నెఫ్ట్ వంటి పేమెంట్స్ విధానాన్ని ఉపయోగించేవారు. కానీ., ప్రస్తుతం వివిధ యాప్స్ ద్వారా ఈ యూపీఐ పేమెంట్ చేయడం చాలా సులువుగా మారింది. ఇక యూపీఐ పేమెంట్ ద్వారా అనేక మంది చాలా మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంగతి మనం ప్రతినిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాము. ఇలా మనం యూపీఐ మోసాలకు బలవ్వకుండా ఉండాలంటే కొన్నిచిన్నపాటి టిప్స్ పాటిస్తే చాలు.. మరి అవేమో ఓసారి చూద్దామా..


ముందుగా మన ఖాతా నుంచి డబ్బును ట్రాన్ఫర్ చేయడానికి యూపీఐ పిన్ ను సెట్ చేసుకోండి. అలాగే యూపీఐడిని ధ్రువీకరణ చేసేటప్పుడు ఒకసారి రిసీవర్ పేరును జాగ్రత్తగా తనిఖీ చేసి ఆ తర్వాత పేమెంట్ చేయడం మంచిది. అలాగే యాప్ యూపీఐ పిన్ పేజీలో మాత్రమే యూపీఐపీను నమోదు చేయండి. ఇక ముఖ్యంగా మన యూపీఐ పిన్నును ఎవరితోను షేర్ చేసుకోకూడదు. అంతేకాకుండా యూపీఐ పేమెంట్స్ విధానాన్ని చేసేటప్పుడు ఎటువంటి స్క్రీన్ షేరింగ్ లేదా ఎస్ఎంఎస్ ఫార్వర్డ్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.


ఇక యూపీఐ పిన్ రక్షణ విషయానికి వస్తే.. మీ ఏటీఎం పిన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ లాగా చాలా జాగ్రత్తగా యూపీఐ పిన్ ను ప్రైవేట్ సెట్టింగ్స్ లో సేవ్ చేసుకొని పెట్టుకోవడం మంచిది.. అంతేకాకుండా ప్రముఖ అధికారిక గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ప్లే స్టోర్ లాంటి యాప్స్ లో మాత్రమే యూపీఐ సంబంధిత యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక మరింత యూపీఐ భద్రత కోసం యాప్ లాక్ ఫ్యూచర్ ను ఆన్ చేసి పెట్టుకోవడం మరింత సురక్షితం. అంతేకాకుండా పబ్లిక్ పేస్ లలో ఉండే వైఫై కనెక్షన్ ద్వారా యూపీఐ పేమెంట్ చేయకుండా మొబైల్ డేటా ద్వారా పేమెంట్స్ చేయడం మరింత సురక్షితమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: