ఈ ఓటర్లే ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎంని డిసైడ్ చేయబోతున్నట్లుగా పలువురు విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. వీరు ఎవరికి వేశారనే విషయం పైన కూడా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయట. అందుకే ఈ ఎన్నికలలో బీసీ ఓట్లు చాలా కీలకంగా మారుతున్నాయి అనే విధంగా తెలియజేస్తున్నారు.అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.. ఫోల్ రిజల్ట్ చూస్తే కనుక 82% పోలింగ్ అయ్యింది.. అయితే ఏదో ఒకవైపు గెలుపు అయి ఉంటుందని మరికొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు.. అత్యాశంగా ఉండదు అనే విధంగా తెలియజేస్తున్నారు..
ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు , మాజీమంత్రి ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఆయన అంచనా ప్రకారం 90 నుంచి 97 సీట్లు ఏ పార్టీకైనా విజయాన్ని చేకూరుస్తాయని అంతకుమించి సీట్లు రావని కూడా తెలియజేస్తున్నారు.. ఈ సీట్లతోనే అధికారంలోకి వచ్చేందుకు ఆస్కారం ఉన్నదని తెలియజేశారు. ఈ ఎన్నికలు చాలా టఫ్ గా నడిచినాయి ఖచ్చితంగా ఫలానా పార్టీ గెలుస్తుంది అనే విషయం చెప్పడం కష్టంగా మారింది అంటూ తెలియజేశారు. ఇప్పుడు రఘువీరా రెడ్డి చేసినటువంటి ఈ విషయం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఏ పార్టీకి కూడా వందకు మించి సీట్లు రావని కూడా తెలియజేయడం గమనార్హం.