ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ పై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలపై... ఎగ్జిట్ పోల్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వైసిపి పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పార్థ చాణక్య అనే ప్రముఖ సర్వే సంస్థ... కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తమ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది.

 పార్థ చాణక్య  ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ది విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ సర్వే సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ సర్వే సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి... ఏకంగా 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలిపోయింది. అంటే ఏపీలో... కచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది.

 ఈ సర్వే సంస్థ కూటమి పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎవరు ఊహించని విధంగా ఈ కూటమి పార్టీలకు సీట్లు ఇచ్చింది పార్థ చాణక్య సర్వే సంస్థ. ఈ సర్వే లెక్కల ప్రకారం కూటమి పార్టీలకు 55 నుంచి 65 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయని తేలిపోయింది. ఇక ఇతరులకు ఒక సీటు కూడా రాదని ఈ సర్వే వెల్లడించింది.

 55 నుంచి 65 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని... ఎంత ప్రయత్నించినా కూటమి అధికారంలోకి రాబోదని ఈ సర్వే సంస్థ వెల్లడి చేసింది. దీంతో కూటమి పార్టీలు... ఆందోళన చెందుతున్నాయి. ఇక మరోవైపు... మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శాతం సర్వే సంస్థలు మాత్రం వైసిపి పార్టీకి అనుకూలంగా ఇస్తున్నాయి. దీంతో ఇటు వైసిపి పార్టీ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: