దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక 2024 లోక్సబ్ ఎన్నికలు నేటితో విజయవంతంగా ముగిసిన సంగతి అందరికీ తెలిసినదే. ఏప్రిల్ 19న మొదలు అయిన పోలింగ్ ప్రక్రియ నేటితో విజయవంతంగా పూర్తి అయ్యింది. మొత్తం లోక్సభ ఎన్నికలు 7 దశలలో జరిగింది. ఇక మరోవైపు నేడు ఇండియా కూటమి ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున కార్గే ఇంట్లో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో ఆమ్ ఆద్ పార్టీ సీనియర్ నేతలు అరవింద్ క్రేజీ సంజయ్ సింగ్ సిపిఎం సీతారాం ఏచూరి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ మీటింగ్ కు తృణమూల్ కాంగ్రెస్ నేతలు అలాగే సీఎం మమతా బెనర్జీ మాత్రం హాజరు కాకపోవడం గామణార్థకం.

ఇండియా కూటమి నేతల మీటింగ్ పూర్తి అయిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమికి 295 + సీట్లు వస్తాయని బిజెపికి దాదాపు 220 సీట్లు, ఎన్డీఏ కూటమికి 235 సీట్లు వస్తాయని అంచనాగా చెప్పారు. అంతేకాకుండా ఇండియా కూటమి బలమైన స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మీడియా సమావేశంగా అరవింద్ తెలియజేశారు. అంతేకాకుండా తర్వాతి ప్రధానమంత్రి ఎవరు అనేది జూన్ 4న తెలుస్తుందని ఆయన అన్నారు.


ఇక మరోవైపు మల్లికార్జున కార్గే ఇండియా కూటమి కనీసం 295 అధికారంలోకి కచ్చితంగా వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.. అలాగే 295 సీట్ల కంటే ఎక్కువగానే వస్తాయి కానీ తక్కువ రావడం జరగదు అంటూ కార్గే అన్నారు. అలాగే మాజీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ఇండియా కూటమి 295+ సీట్లు గెలుచుకుంటుందని ఆయన కూడా బీమా వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే బిజెపి తెలియజేస్తున్న 400 సీట్లు అనే నానుడి విఫలమవుతుందని.. అలాగే దేశ ప్రధాని ఎవరు అనేది కూడా ఆ తర్వాత నిర్ధారణ జరుగుతుందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: