ఐదేళ్లు పరిపాలన సాగించిన తర్వాత ఈ స్థాయిలో సీట్లు సాధించడం అంటే సాధారణమైన విషయం కాదు. అయితే వైసీపీ మాత్రం తన మ్యాజిక్ ను రిపీట్ చేయనుందని తేలిపోయింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన కూటమి ఈ ఎన్నికల్లో మాత్రం 50 నుంచి 60 స్థానాల్లో విజయం సాధించవచ్చని పోల్ స్ట్రాటజీ సంస్థ చెబుతోంది. వైసీపీ, కూటమి మినహా ఇతర పార్టీలు గెలిచే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
ఎంపీ ఫలితాలకు సంబంధించి ఒక్కో సంస్థ ఒక్కో తరహా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వైసీపీకి 14 ఎంపీ స్థానాలు వస్తాయని టైమ్స్ నవ్ ఈటీజీ సంస్థ చెబుతుండగా ఆత్మసాక్షి సంస్థ మాత్రం వైసీపీకి 17 ఎంపీ స్థానాలు వస్తాయని చెబుతోంది. రేస్ సంస్థ వైసీపీకి ఏకంగా 19 స్థానాల్లో విజయం దక్కుతుందని వెల్లడించింది. ఎంపీ స్థానాల విషయంలో కూటమి 6 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
సర్వేల ఫలితాలలో కొన్ని వైసీపీకి కొన్ని కూటమికి అనుకూలంగా ఉండటంతో మరింత గందరగోళం నెలకొంది. గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితి లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ గెలిచినా 95 నుంచి 110 స్థానాలకే పరిమితం అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీ.ఆర్.ఎస్ కు భారీ షాక్ తగలనుందని సర్వేలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఊహించని ఫలితాలు ఈ ఎన్నికల్లో రానున్నాయని తెలుస్తోంది.