ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల ముగిస్తాయి. 2023 నుంచి ఎన్నికల కసరత్తులు మొదలు పెట్టిన నాయకులు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అనేక విధానాలుగా ప్రయత్నాలు చేశారు. ఎవరికి నచ్చిన విధంగా వారు హామీలు ఇస్తూ ప్రజలను మెస్మరైజ్ చేశారు. ఎన్నో ప్రలోభాలు, భయాలు బెదిరింపులు ఇలా అనేక రకాలుగా ప్రజలను వారికి ఓటు వేసేలా చేసుకున్నారు. అలాంటి ఓటింగ్ మే 13న ముగిసింది.
దేశవ్యాప్తంగా ఏడూ విడతల ఎన్నికలు ముగిశాయి. ఈ తరుణంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది జూన్ 4వ తేదీన పూర్తిగా తేట తెల్లమవుతుంది. ఇదే తరుణం లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి అనేక సర్వేలు రకరకాలుగా చెబుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. వైసిపి, టిడిపి, కాంగ్రెస్ కూటమి మధ్య హోరా హోరీ పోటీ ఏర్పడింది. ఇందులో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కష్టంగా మారింది. అలాంటి ఈ తరుణంలో చాలామంది రిజల్ట్ కు ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ మీద కొన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి నిజమవుతాయి. వారు చెప్పినదానికి అటు ఇటుగా రిజల్ట్స్ వస్తాయి. ఈ క్రమం లో ఏపీ లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ పోల్స్ లో చాలా ఆసక్తికరమైన ఫలితాలు బయటకు వచ్చాయి. ఈ ఫలితాల ఆధారం గానే గెలుపు , ఓటమి అనేది నిర్ణయించబడుతుంది. అలాంటి ఎగ్జిట్ పోల్స్ లో చాలా ఆసక్తికరమైన ఎగ్జిట్ పోల్ అందించిన సంస్థ పార్థ దాస్ ఎగ్జిట్ పోల్స్.. ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో వైసీపీ పార్టీకి 110 నుంచి 120 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టిడిపి కూటమికి 55 నుంచి 65 వస్తాయని మిగతావాళ్లు సున్నాకే పరిమితం అవుతారని తెలియజేస్తోంది. ఈ ఫలితాలు చూసినటువంటి వైసీపీ శ్రేణులు ఆనందం నెలకొంది. ఈ సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్ నిజమవుతుందా ..లేదా.. అనేది జూన్ నాలుగో తేదీ న తేట తేల్లామవుతుంది.