ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎన్నికలు ముగిసాయి. భారతదేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు కూడా ఇవాళ్ళతో అయిపోయాయి ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు సర్వేలకు చాలా భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన ఏకే ఎగ్జిట్ పోల్స్ ప్రకారము ఆంధ్ర రాష్ట్రంలో టీడీపి 133 అసెంబ్లీ స్థానాలలో గెలవనుంది వైసిపి 14 సీట్లే రామన్నాయి. కేకే సర్వే ప్రకారం కేవలం, 6 సీట్లలో మాత్రమే వైసీపీ కన్ఫామ్ గా గెలవగలదు. మిగతా ఎనిమిది సీట్లలో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని, వాటిని కూడా కలుపుకుంటే 14 సీట్లు వైసీపీకి రానున్నాయని ఈ సర్వే అభిప్రాయపడింది.

ఆ ఆరు సీట్లలో పులివెందుల, బద్వేల్, ఎర్రగొండపాలెం, ఆదోని, ఆలూరు, పుంగనూరు, ఉన్నాయి. అంటే జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు మాత్రమే గెలవనున్నారట. మిగతావారు మొత్తం ఓడిపోనున్నారని ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది. అరకు, తుని, ఆత్మకూరు,  చంద్రగిరి, సర్వేపల్లి, నెల్లూరు, రాయచోటి, నందికొట్కూరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే తెలిపింది.

ఇక ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని, వైసీపీ చాలా చోట్ల డక్ ఔట్ అయ్యిందని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడ ఈ సర్వే జనసేన గురించి ఒక సంచలన అంచనా వేసింది అదేంటంటే పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన ప్రతి చోటా అంటే 21 చోట్ల కూడా గెలుస్తుందట. కేకే సర్వే చాలా ఆలోచించే ప్రజాభిప్రాయాలను సేకరించి, ఓటింగ్ సరళిని పరీక్షించి మరీ ఈ సీట్లలో జనసేన గెలవబోతుందని తెలుసుకుని చెబుతున్నదట. పోటీ చేసిన ప్రతి చోట పవన్ కలిస్తే అంటే 100% విజన్ సాధిస్తే ఇక ఆయనే సీఎం అయిపోయిన అయిపోవచ్చు అన్నట్లు కేకే సర్వే వెల్లడించింది. ఇక కూటమిలో భాగమైన బీజేపీ పదిచోట్ల పోటీ చేస్తే ఏడు చోట్ల గెలుస్తుందని కేకే సర్వే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: