ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం... ఏపీలో పలు సంచలన మార్పులు చోటుచేసుకొని ఉన్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ తమ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీలో చాలామంది మంత్రులు ఓడిపోబోతున్నారు. ఈ లిస్టులో గుడివాడ అమర్నాథ్ మొదటి వరుసలో ఉన్నాడు. అలాగే అప్పలరాజు కూడా ఓడిపోతున్నట్లు ఆరా మస్తాన్ సంస్థ వెల్లడించింది.
అలాగే కారుమూరి నాగేశ్వరరావు, చెల్లబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, ఓడిపోబోతున్నారట. అంబటి రాంబాబు గట్టి పోటీ ఎదుర్కొని... ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయట. అలాగే విడదల రజిని పరిస్థితి కూడా అలాగే ఉందని ఆరా మస్తాన్ వెల్లడించింది. అంతేకాకుండా ఆదిమూలపు సురేష్, శ్రీమతి ఉషాశ్రీ చరణ్ స్వల్ప తేడాతో ఓడిపోతారట.
గుమ్మనూరు జయరాం కూడా ఓడిపోతారట. ఇక నగరి ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా... ముందు నుంచి అనుకున్నట్లే ఓడిపోబోతున్నారట. అలాగే ఏపీలో 94 నుంచి 115 సీట్ల మధ్య వైసీపీ పార్టీకి వస్తాయని... అధికారం మరోసారి జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్నట్లు ఆరా మస్తాన్ వెల్లడించింది. అంతేకాకుండా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల పై కూడా ఆరా మస్తాన్ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ప్రకటన చేసింది ఆరా మస్తాన్ సర్వే సంస్థ. మచిలీపట్నం కాకినాడ ఎంపీ స్థానాలను కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందని ఆరా మస్తాన్ వెల్లడించింది. తెలుగుదేశం కూటమికి 77 స్థానాల నుంచి 90 మధ్య వస్తుందని తెలిపింది.