తెలుగు రాష్ట్రాల్లో ఆరా మస్తాన్ సర్వేకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ సర్వే చేసిన అంచనాలు చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సర్వే ఏపీ ఎన్నికలపై అంచనాలను వేసింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీ 94-104 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 71 నుంచి 81 సీట్లను గెలుచుకుంటుందని ఆరా సర్వే అంచనా వేసింది. వైసీపీ పార్లమెంట్ సీట్లలో 13 – 15 విన్ అవుతుందని తెలిపారు. టీడీపీ 10 – 12 పార్లమెంట్ స్థానాల్లో విజయ బావుటా ఎగరవేస్తుందని అంచనా వేశారు.

ద‌ర్శి, పొన్నూరులో వైసీపీ గెలుస్తుందని చెబుతూ చిల‌క‌లూరిపేటలో ఎవ‌రు గెలుస్తారో తెలిసినా చెప్ప‌ను అని ఆరా మస్తాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 3 శాతానికి లోబ‌డి ఫ‌లితాలు వ‌చ్చే సీట్లు ఏపీలో ఏకంగా 19 ఉన్నాయని, అందులో మంత్రుల సీట్లు అధికంగా ఉన్నాయని కామెంట్ చేశారు. వైసీపీ 103 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చ‌గా.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ అభ్యర్థులే గెలవబోతున్నారని చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల ఓట్లలో 75 శాతం కూట‌మికే పడినట్లు తెలిపారు దీన్ని బట్టి వీళ్లు నిజంగానే వైసిపి ప్రభుత్వంపై శాసనసభ్యులతో ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఆరా సర్వేలో జనసేనకు 2 లోక్ సభ స్థానాలు రానున్నాయని తేలింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ మెజార్టీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేసింది. కీలక నియోజకవర్గమైన పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్ కల్యాణ్ కూడా ఘన విజయం సాధించబోతున్నారని అంచనా వేసింది.

మంగళగిరిలో నారా లోకేశ్ కు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆరా సర్వే అంచనా వేయడం ఇప్పుడు ఏపీలో పెద్ద హార్ట్ టాపిక్ అయింది. ఎట్టకేలకు లోకేష్ కృషి ఫలించింది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా ఆరా సర్వే ప్రకారం హిందూపురంలో మూడోసారి గెలిచి బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకుంటారు. ఉండిలో రఘురామరాజు విజయం సాధిస్తే, నెల్లూరులో వైసీపీ సీనియర్ విజయసాయిరెడ్డి ఓడిపోనున్నారు. టీడీపీ పాపులర్ లీడర్ అచ్చెన్నాయుడు టెక్కలిలో మరోసారి గెలవనున్నాడు. అనకాపల్లిలో సీఎం రమేష్ విజయం సాధించనుండగా, తెనాలిలో నాదెండ్ల మనోహర్ విజయ బావుటా ఎగరవేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: