దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. ఏడు విడతలో భారత దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరూ ఈ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... కాసేపటి క్రితమే ఎగ్జిట్ ఫలితాలు విడుదలయ్యాయి.
 

 ముందుగా అందరూ ఊహించినట్లుగానే... ఈ ఎగ్జిట్ ఫలితాలు కూడా వస్తున్నాయి. అన్ని ఎగ్జిట్ ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తమ రిపోర్టులను  వెల్లడిస్తున్నాయి. మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నట్లు తేల్చి చెప్పాయి ఈ సర్వే సంస్థలు. రిపబ్లిక్ పి మార్క్  సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 359 సీట్లు రానున్నాయి. ఇందులో  ఇండియా కూటమి కేవలం 154 స్థానాలు దక్కించుకోనిందట. ఇతరులకు 30 స్థానాలు వస్తాయని తేల్చి చెప్పింది.

 

 ఇటు ఇండియా న్యూస్ - డి డైనమిక్స్  ఎగ్జిట్ పోల్స్ రిపోర్టు ప్రకారం ఎండీఏ కూటమికి 371 స్థానాలు రానున్నాయి. ఇండియా కూటమికి 125 స్థానాలు వస్తాయట. ఇతరులకు 47 స్థానాలు వస్తాయని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా రిపబ్లిక్ భారత్  - మాట్రిక్స్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... ఎన్డీఏ కూటమికి 353 నుంచి 368 ఎంపీ స్థానాలు వస్తాయట.

 

ఇండియా కూటమికి... 118 నుంచి 133 స్థానాలు వస్తాయని తేల్చి చెప్పింది ఈ సర్వే సంస్థ. ఇతరులకు 43 నుంచి 48 స్థానాలు వస్తాయట. అంతేకాకుండా జానకీ బాత్  సర్వే లెక్కల ప్రకారం... ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 స్థానాలు దక్కుతాయని తేలిపోయింది. ఇండియా కూటమికి.. కేవలం 141 నుంచి 161 వరకు వస్తానాలు వస్తాయట. ఇతరులకు 10 నుంచి 20 స్థానాలు దక్కుతాయని తేలిపోయింది. న్యూస్ నేషన్  ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం ఇండియా కూటమికి 340 నుంచి 378 స్థానాలు వస్తాయి అని పేర్కొంది. ఇండియా కూటమికి 153 నుంచి 169 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. ఇతరులకు 21 నుంచి 33 స్థానాలు వస్తాయని... ఈ సర్వే వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: